Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని ఎస్బిఐ లైఫ్ ఆఫీసులో ‘ఫాదర్స్ డే ‘ను పురస్కరించుకొని ఆదివారం ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ చేసిన ఐదుగురు కస్టమర్ల(ఫాదర్)ను లైఫ్ మిత్ర తౌటం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. స్వీట్స్ పంచిపెట్టి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో, కుటుంబంలో ఫాదర్ లకు ప్రత్యేక గుర్తింపు, బరువు బాధ్యతలు ఉంటాయని ఈ సందర్భంగా ఎస్బిఐ డివిజనల్ సీనియర్ మేనేజర్ సతీష్, యూనిట్ మేనేజర్ బి రమేష్ లు పేర్కొన్నారు. కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తండ్రులు పిల్లలకు కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
సన్మానం పొందిన వారిలో లైఫ్ ఇన్సూరెన్స్ చేసిన కస్టమర్లు కడవెరువు సత్యం, వోడ్నాల రామకృష్ణ, మంచికట్ల సమ్మయ్య, సందుపట్ల సదానందం, రాజు లను అధికారులు శాలువాలతో ఘనంగా సన్మానించి, స్వీట్స్ తినిపించి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు, కార్యాలయ ఉద్యోగులు, పలువురు తండ్రులు పాల్గొన్నారు.

ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ చేసిన ఐదుగురు కస్టమర్ల(ఫాదర్)ను లైఫ్ మిత్ర తౌటం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరిస్తున్న ఎస్బిఐ డివిజనల్ సీనియర్ మేనేజర్ సతీష్, యూనిట్ మేనేజర్ బి రమేష్ లు..





