Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కోర్టు సముదాయంలో శనివారం మెగా లోక్ అదాలత్ కార్యక్రమంలో 655 కేసులకు పరిష్కారం లభించింది. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి పిబి కిరణ్ కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పద్మ సాయిశ్రీ లు ఈ సందర్భంగా కక్షిదారులతో మాట్లాడుతూ… రాజీమార్గమే రాజమార్గమని క్షణికావేశంలో కేసులు పెట్టుకోవడం వల్ల నష్టపోతామని అన్నారు. క్షణికావేశంలో చేసే చిన్నచిన్న పొరపాట్లే పెద్దగా మారి జీవితానికి ముప్పుగా పరిణమిస్తాయన్నారు. రాజీమార్గం ద్వారా లో కాదాలతో ద్వారా సత్వరమే కేసులను పరిష్కరించుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు వీణా ప్రణతి, బోనగిరి కుమారస్వామి, ఏ వెంకటేశ్వరరావు, ఏ లింగమూర్తి, పలువురు పోలీసులు, వివిధ సంస్థల ఉద్యోగులు పాల్గొన్నారు.

కోర్టులో రాజీమార్గం ద్వారా కేసును పరిష్కరిస్తున్న న్యాయమూర్తులు..





