Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు ఆదివారం విశ్వకర్మ మనమయ సంఘం ఆధ్వర్యంలో హుజురాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాలను నేటి యువత కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంగం మండల అధ్యక్షుడు తాడికొండ శ్రీనివాస్, మహాత్మా జ్యోతిబాపూలే అధ్యక్షుడు చల్లూరి రఘు చారి, బాణాల సత్యనారాయణ, వీరన్న, రాంపల్లి శ్రీనివాస్, రావుల వేణు, చందుపట్ల జనార్దన్, వేల్పుల రత్నం, అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ చైర్మన్ ఆడెపు సురేందర్, తాళ్లపల్లి రమేష్, కొలిపాక సమ్మయ్య, ముషం సంగీత గణేష్, పోరెడ్డి దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న విశ్వకర్మ మనమయ సంఘం నాయకులు





