
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:Jun 21, 2026: దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన “నీట్ రీ ఎగ్జామ్”
ప్రశాంతంగా ముగిసింది. 551 నగరాల్లోని 5,440 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్ నిర్వహించగా, 23 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష కొనసాగింది. దివ్యాంగ అభ్యర్థులకు అదనపు సమయం కల్పించారు. పరీక్ష నిర్వహణకు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేయగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా పరీక్ష సజావుగా ముగిసినట్లు అధికారులు తెలిపారు.





