
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నమస్తే తెలంగాణ సీనియర్ పాత్రికేయుడు గూడూరి కొండల్ రెడ్డి మాతృమూర్తి లక్ష్మి ఇటీవల వృద్ధాప్యంతో మృతిచెందగా ఆయనను మల్కాజిగిరి ఎంపీ బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ శుక్రవారం పరామర్శించారు. మండలంలోని ఇప్పల్ నర్సింగాపూర్ గ్రామంలో నమస్తే తెలంగాణ విలేఖరి గూడూరి కొండల్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన తల్లి లక్ష్మి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని ఈటల రాజేందర్ వ్యక్తం చేశారు. ఆయన వెంట బిజెపి ప్రజా ప్రతినిధులు, నాయకులు, బంధువులు, గ్రామస్తులు ఉన్నారు.

గూడూరు లక్ష్మీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎంపీ ఈటెల రాజేందర్, బిజెపి నాయకులు..





