
—పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలి. – తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: నీట్ పరీక్షను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విద్యార్థులు డిల్లీలో తమ నిరసన తేలియజేస్తే వారి పైన పోలీసులు వ్యవహరించిన తీరు పైన ఈరోజు కరీంనగర్ లో శాతవాహన యూనివర్సిటీ జేఏసీ చైర్మన్, తెలంగాణ రక్షణ సేన మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జి చెన్నమల్ల చైతన్య ఆద్వర్యంలో నిరవధిక దీక్షను ప్రారంభించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ విద్యార్థుల దీక్షకు జిల్లా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు రాసే ప్రతిష్ఠాత్మక నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావడం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటమేనని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ కావాలనే లక్ష్యంతో ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్న విద్యార్థుల ఆశయాలను వరుస పేపర్ లీకేజీలు దెబ్బతీస్తున్నాయని, వాటిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

నీట్ పేపర్ లీకేజీ ఘటనలతో తీవ్ర మనోవేదనకు గురై పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు వస్తున్న వార్తలు అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఈ ఘటనల వల్ల నష్టపోయిన కుటుంబాలకు ఎవరు బాధ్యత వహిస్తారో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థులపై ఢిల్లీలో పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. విద్యార్థులపై బలప్రయోగం చేయడం, మహిళా విద్యార్థులతో అమానుషంగా వ్యవహరించారనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంటూ, ఈ ఘటనకు బాధ్యులైన పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
దేశవ్యాప్తంగా విద్యార్థి లోకం మొత్తం నీట్ పేపర్ లీకేజీ బాధితుల పక్షాన నిలబడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని అన్నారు. రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా వైద్య విద్య ప్రవేశ పరీక్షలను రాష్ట్రాలే నిర్వహించే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని సూచించారు.

అదేవిధంగా మనకోండుర్ నియోజకవర్గం ఇంచార్జ్ చెన్నమల్ల చైతన్య మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి UPSC తరహాలో స్వయం ప్రతిపత్తి కల్పించి, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం, భద్రతను పెంపొందిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయవచ్చని అభిప్రాయపడ్డారు.
నీట్ పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఈ ఘటనకు కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా, తెలంగాణలో ఇంటర్మీడియట్, గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై విమర్శలు ఎదుర్కొన్న నాయకులు ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.
దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును కాపాడేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రత, విశ్వసనీయతను పునరుద్ధరించే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా శాతవాహన యూనివర్సిటీలో తెలంగాణ రక్షణ సేన నాయకులు నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు లింగంపల్లి నాగరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, మహిళా విభాగం అధ్యక్షురాలు అంకం శివరాణి, బీసీ విభాగం అధ్యక్షులు శ్రీరాముల రమేష్, ఆదివాసి విభాగం అధ్యక్షులు కుతాడి శ్రీనివాస్, సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, సీనియర్ నాయకులు బుడిగె పరుశురాంగౌడ్, మ్యాక వినోద్, లింగంపల్లి శ్రీనివాస్, భాసవేణి రాజేందర్, నూతి సాయిచరణ్, పుసాల పవన్, చింతరెడ్డి జైపాల్ రెడ్డి, ఎండి రజి, ఎండి హుస్సేన్, బండ అశోక్, ఎండి సాల్మ, జంగా అపర్ణ, అతహర్, పొన్నం శిరీష, కొలిపాక గౌతమి, శారద, ఆసియా సుల్తానా తదితరులు పాల్గొన్నారు.
@లోకల్ యాడ్స్@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు..

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ కంచి వేణు గారు, ఎంవిఐ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





