
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్‌లోని శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయంలో రేపు గురుపౌర్ణమి (జులై 29) పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.
ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు వివరాలు:

కాకడ హారతి & సుప్రభాతం: ఉదయం తెల్లవారుజాము నుంచే స్వామివారికి కాకడ హారతి, సుప్రభాత సేవ.
ప్రత్యేక అభిషేకాలు & అలంకరణ: పవిత్ర తీర్థాలు, పంచామృతాలతో బాబావారికి శతాభిషేకం మరియు స్వామివారికి విశేష పుష్పాలంకరణ.
సాయి సహస్రనామార్చన & హోమం: భక్తుల సుఖసంతోషాలకై ప్రత్యేక అర్చనలు, సాయి సచ్చరిత పారాయణం మరియు గురు పూజ.
మహా మంగళహారతి & తీర్థప్రసాద వితరణ: మధ్యాహ్నం మహా హారతి అనంతరం భక్తులందరికీ ప్రసాద వితరణ మరియు మహా అన్నదాన కార్యక్రమం.


భక్తులకు ఆహ్వానం:
ఆలయ కమిటీ తరఫున భక్తులందరికీ శ్రద్ధా సబూరీలతో ఆహ్వానం పలుకుతున్నారు. భక్తులందరూ విశేష సంఖ్యలో హాజరై, సాయినాథుని దివ్య దర్శనం చేసుకొని, స్వామివారి కృపాకటాక్షాలు మరియు ఆశీస్సులు పొందాల్సిందిగా కోరడమైనది.
గమనిక: భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ప్రాంగణంలో క్యూలైన్లు, మంచినీటి సదుపాయం మరియు మధ్యాహ్నం అన్న వితరణ, తదితర ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





