
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హుజురాబాద్ మునిసిపల్ చైర్పర్సన్ రోoటాల సుహాసిని కోరారు. మంగళవారం హుజురాబాద్ మునిసిపల్ కార్యాలయ ఆవరణలో వన మహోత్సవాన్ని పురస్కరించుకొని పురపాలక కార్యవర్గానికి మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. ప్రజలందరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమవంతుగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్ పర్సన్ గూడూరి అంజలి, కౌన్సిలర్లు, కొ-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మేకల తిరుపతి, కార్యాలయ మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ డి కిరణ్, ఇంచార్జి రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, సీనియర్ సహాయకులు వాణి, ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ పి వినయ్ పాల్గొన్నారు.
#లోకల్ యాడ్స్#
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





