
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని అల్ఫోర్స్ జీనియస్ స్కూల్ లో హౌస్ లీడర్ల ఎంపిక కోసం పాఠశాల ఎన్నికలు బుధవారం రోజున ఘనంగా నిర్వహించారు. చిన్నారుల్లో ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఈ ఎన్నికలను నిజమైన ఎన్నికలను తలపించేలా ఒక పండుగలా జరిగాయి.


ఈ ఎన్నికల్లో పాఠశాలలోని వివిధ హౌస్‌లకు హౌస్ కెప్టెన్, వైస్ కెప్టెన్, పదవులకు విద్యార్థులు పోటీ చేశారు. ఈ సందర్బంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ… విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన ఆలోచన, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే లక్ష్యంతో హౌస్ ఎలక్షన్స్ ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారం, నామినేషన్, ఓటింగ్, ఓట్ల లెక్కింపు వంటి అన్ని ప్రక్రియలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహనతో పాటు నాయకత్వ నైపుణ్యాలు, క్రమశిక్షణ, జట్టు భావన పెంపొందుతాయని అన్నారు. స్కూల్ విద్యార్థులు అందరూ ఎంతో ఉత్సాహంగా పోలింగ్ బూత్‌లలో లైన్లలో నిలబడి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నామినేషన్ల దాఖలు, స్కూల్ ఐడీ కార్డుల పరిశీలన, గుర్తుల కేటాయింపు మరియు విద్యార్థి అభ్యర్థుల విస్తృత ప్రచారాల తర్వాత ఈ పోలింగ్ ప్రక్రియను నిర్వహించారు.


హౌస్ ఎలక్షన్స్ నిర్వహిస్తున్న దృశ్యాలు..

అలాగే పాఠశాలలో గురు పౌర్ణమి వేడుకలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
&లోకల్ యాడ్స్&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





