Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : వర్షాకాలంలో కూడా కమాండ్ ఏరియాలో పూర్తిగా నాట్లు వేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లనే రైతులకు ఈ దుస్థితి వచ్చిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ గా పేరుగాంచిన బుధవారం హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో ఆయన ఇంకా నాట్లు పడని పలు వ్యవసాయ భూములను చూశారు. సాగు నీరు సరిపోదని బావులు తవ్వుతున్న రైతులను ఆయన కలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. 12 ఏళ్ల క్రితం తెలంగాణలో నీటి కొరత ఉండేదని కానీ స్వయంగా రైతు బిడ్డ అయినా మాజీ సీఎం కేసీఆర్ దూర దృష్టితో రైతులకు, ప్రజలకు సాగు , త్రాగు నీటి కొరత ఉండరాదనే ఉద్దేశ్యంతో మిషన్ భగీరథ ,మిషన్ కాకతీయ పథకాలతో పాటు కాలేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని అన్నారు. ఆయన ముందు చూపు వల్ల తెలంగాణలో కరెంటుకు కొరత నీటికి కొరత లేకుండా ఉన్నదని అన్నారు. వేసవి కాలంలో కూడా చెరువులు మత్తడి పడేవి అన్నారు. కానీ లేనిపోని అబద్దాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల బాగోగులు పట్టించుకోకపోవడం లేదని అన్నారు. తెలంగాణ రైతులకు ప్రజలకు వరప్రదాయంగా భావించిన కాలేశ్వరం ప్రాజెక్టుపై అడ్డగోలు అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు.
— ఈ కరువు కాంగ్రెస్ తెచ్చింది
ఎల్ నినో ప్రభావం వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని శాస్త్రవేత్తలు మొదటి నుండి హెచ్చరిస్తున్నప్పటికీ కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీరు పంపుల ద్వారా ఎత్తిపోయకుండా రైతులకు కాంగ్రెస్ పార్టీ కృత్రిమంగా తెచ్చిందని కౌశిక్ రెడ్డి అన్నారు. సముద్రంలో కలుస్తున్న లక్షలాది క్యూసెక్కుల నీటిని కన్నేపల్లి పంపు హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోయడం ద్వారా రైతులకు ప్రయోజనం ఉంటుందన్నారు. కానీ ఇంతకాలం అబద్దాలు ప్రచారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి నీటిని ఎత్తిపోయడం ద్వారా కేసిఆర్ కు పేరు వస్తుందని మొండిగా రైతులను నష్టపరుస్తున్నారని అన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి వల్లనే ఈ కరువు వచ్చిందన్నారు. సిరిసపల్లి ప్రాంతంలో కూడా ఇప్పటికీ రైతులు పూర్తిగా వరి నాట్లు వేయలేదని అన్నారు. రాజకీయాలు ఎన్నికల సమయంలో చేయాలి తప్ప రైతులను కేసీఆర్ పై కోపంతో ముంచడం సరికాదన్నారు. ఇప్పటికైనా రైతుల ప్రజల నీటి కష్టాలు తీరడానికి కన్నెపల్లి పంపు హౌస్ నుండి సముద్రంలో వృధాగా పోతున్న నీటిని ఎత్తిపోయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
––కలెక్టర్ వద్దకు వెళ్తే పోలీసులతో అడ్డుకుంటారా….!?
నియోజకవర్గానికి చెందిన ప్రజల సమస్యలు జిల్లా కలెక్టర్ కు విన్నవించడానికి వెళుతుండగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటుచేసి తనను అడ్డుకుంటారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. పోలీసుల వైఫల్యాలను తాను విమర్శిస్తుండడం వల్ల సిపి తనపై ఆగ్రహం చెంది పోలీసులతో తనను అడ్డుకుంటున్నాడని, సీఎం రేవంత్ రెడ్డి సైతం పోలీసులతో తనపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. అయినప్పటికీ ప్రజల కోసం చేసే తన పోరాటం ఆగదని అన్నారు.
#లోకల్ యాడ్స్#
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: క్రీష్ణవేణి టాలెంట్ స్కూల్ హుజురాబాద్ కరీంనగర్ జిల్లా.





