
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆర్ డిఓ జల కుమారిని ఎమ్మార్ పీఎస్ నేతలు మర్యాదపూర్వకముగా కలిశారు. మారపల్లి శ్రీనివాస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తునికి వసంత్ మహాజన సోషలిస్టు పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మరియు కలువల మల్లయ్య సమాచార హక్కు చట్టం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఆర్డీవో ను శాలువతో సత్కరించి బోకేతో ఘనంగా సన్మానించారు. హుజురాబాద్ ఆర్డిఓ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జల కుమారి ప్రజల, రైతుల సమస్యలు, భూ సమస్యలు సకాలంలో పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్డీవో గా సమర్థవంతంగా విధులు నిర్వహించి హుజురాబాద్ డివిజన్ కు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.
&లోకల్ యాడ్స్&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ హుజురాబాద్ కరీంనగర్ జిల్లా.





