
—వన మహోత్సవం సందర్భంగా ఇంటింటికి మొక్కలు పంపిణీ చేసిన ఛైర్మెన్..
—హుజురాబాద్ లో ఘనంగా వన మహోత్సవం..
—మొక్కను బ్రతికిస్తే జీవితాన్ని బ్రతికించినట్టే..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రాణ కోటికి జీవనాధారం మొక్క అని అలాంటి మొక్కను బ్రతికించి ప్రజలకు ప్రాణవాయువు పోయాలని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని పిలుపునిచ్చారు. గురువారం రోజున హుజురాబాద్ మున్సిపల్ వార్డుల్లో ఇంటింటికి మొక్కలు స్థానిక కౌన్సిలర్లతో కలిసి పంపిణీ చేశారు.

అనంతరం ఆమే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమాన్ని గ్రామ, గ్రామాన పట్టణాల్లో ఘనంగా నిర్వహిస్తుందని, ప్రస్తుతం ఎల్ నీ నో లాంటి విపత్తులను తట్టుకోలవాలి అంటే మొక్కలు పెంచి వాటిని వృక్షాలుగా మలిచి ప్రకృతికి సహాయం చేయాలని తద్వారా రైతులకు, జీవనాధారానికి ప్రాణ వాయువు పోసిన వాళ్ళం అవుతామని అన్నారు. ఇప్పటి నుండి హుజురాబాద్ పట్టణ పరిధిలోని ప్రతి ఒక్కరు ఇంటికి ఒక మొక్కను పెంచి ప్రకృతికి సహకరించాలని, ప్రతీ మనిషి ఒక మొక్కను నాటి ప్రజలకు సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



పట్టణంలోని పలు వార్డుల్లో ప్రజలకు మొక్కలు పంపిణీ చేస్తున్న చైర్పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు..
#లోకల్ యాడ్స్#
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: క్రీష్ణవేణి టాలెంట్ స్కూల్ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





