Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : నేటి సమాజంలో జరుగుతున్న పరిస్థులను బట్టి యువతులు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హుజురాబాద్ ఏ.ఎస్.ఐ కమల అన్నారు. గురువారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రపంచ మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా విద్యార్థి నీలకు అవగాహన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…..మానవ అక్రమ రవాణా అంటే ఏమిటి, అది ఎలా జరుగుతుంది అనే విషయాలపై అవగాహన అన్నారు. అపరిచిత వ్యక్తుల మాటలను నమ్మకూడదని, ఎలాంటి అనుమానాస్పద సంఘటనలు కనిపించిన వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
సోషల్ మీడియా వినియోగంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తెలియని వ్యక్తులతో స్నేహాలు చేయకూడదని, వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరికీ ఇవ్వకూడదని, నకిలీ ఉద్యోగ ప్రకటనలు, లింకులు, ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్టులు శైలజ, కవితలు మాట్లాడుతూ…విద్యార్థులు తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ సుగుణ, సఖీ వన్ స్టాప్ సెంటర్ కౌన్సిలర్ రేణుక, ఐసీడీఎస్ సూపర్వైజర్ రమ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
& లోకల్ యాడ్స్ &
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: క్రీష్ణవేణి టాలెంట్ స్కూల్ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





