
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : కాకతీయ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల విభాగ హెచ్వోడిగా హుజురాబాద్ పట్టణానికి చెందిన డాక్టర్ బండ శ్రీకాంత్ నియమితులయ్యారు. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించి గనుల భద్రత పరిశోధనల్లో అంతర్జాతీయ గుర్తింపు పొందారు. దేశంలోనే అత్యున్నత విద్యాలయమైన ఐఐటీ ఖరగ్పూర్ నుండి ‘మైక్రోఎలక్ట్రానిక్స్ అండ్ డిజైన్’ లో ఎం.టెక్ పూర్తి చేశారు. ఆపై పరిశోధనలపై ఉన్న ఆసక్తితో ఐఐటీ ధన్బాద్ నుండి పిహెచ్డీ పట్టా పొందారు.
కేవలం విద్యకే పరిమితం కాకుండా, సమాజానికి ఉపయోగపడే సాంకేతికతపై ఆయన కృషి చేశారు. ముఖ్యంగా సింగరేణి, బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల భద్రత కోసం “ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , స్మార్ట్ సెన్సార్లు” ఉపయోగించి ‘రూఫ్ కన్వర్జెన్స్ మోనిటరింగ్ సిస్టమ్’ రూపకల్పన చేశారు. గనుల్లో ప్రమాదాలను ముందుగానే గుర్తించి కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు ఆయన చేసిన పరిశోధనలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రశంసలు, పేటెంట్లు, అంతర్జాతీయ రీసెర్చ్ అవార్డులు లభించాయి.
2010 నుండి కొత్తగూడెంలోని కేయూ ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వేలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన డాక్టర్ శ్రీకాంత్ గారు, తన సమర్థత, నాయకత్వ లక్షణాలతో వర్సిటీలో కీలక బాధ్యతలను నిర్వర్తించారు.
ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ… ఒక సాధారణ గ్రామీణ మధ్యతరగతి నేపథ్యం నుండి వచ్చి ఈ స్థాయికి ఎదిగానని, మనం ఎక్కడి నుండి వచ్చామన్నది ముఖ్యం కాదు, మన లక్ష్యం ఎంత పెద్దదన్నదే ముఖ్యం అని, సాంకేతికత వేగంగా మారుతోంది. ఐఓటీ , ఏఐ వంటి ఆధునిక సాంకేతికతలపై అవగాహన పెంచుకుంటూ, సమాజంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపే పరిశోధనల వైపు విద్యార్థులు అడుగులు వేయాలి” అని అన్నారు. సాధారణ కుటుంబం నుండి వచ్చి స్వయంకృషితో ఉన్నత శిఖరాలను చేరుకున్న డాక్టర్ బండ శ్రీకాంత్ ప్రయాణం నేటి తరం ఇంజనీరింగ్ విద్యార్థులకు మార్గదర్శకం.

@#లోకల్ యాడ్స్ @#
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.




