
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని గాంధీ నగర్ కు చెందిన ట్రాన్స్ జెండర్ రోంటాల కుమార్(47) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ట్రాన్స్ జెండర్ కుమార్ ఈ ప్రాంత ప్రజలకు ఎంతో సుపరిచితుడు. ఆయన మృతి చెందడంతో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు క్రీ.శే. రొంటాల కుమారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులతో పాటు కరీంనగర్, హైదరాబాదు, ముంబై కి చెందిన అనేకమంది ట్రాన్స్ జెండర్లు ఆయన అంత్యాక్రియలకు హాజరయ్యారు. ట్రాన్స్ జెండర్ ల ఆచారాల ప్రకారం పూజలు నిర్వహించి అంత్యక్రియలు జరిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ బోరగాల మొగిలి, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

కుమారి తల్లిని ఓదార్చుకున్న చైర్పర్సన్ సుహాసిని దంపతులు..





