
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను కొంతమంది వ్యక్తులు కబ్జాలకు పాల్పడుతున్నారని వారి నుండి ప్రభుత్వ భూములను కాపాడాలని ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య అన్నారు.


ఆదివారం ఆయన మాట్లాడుతూ… హుజురాబాద్ పటాల శివారులోని గణేష్ నగర్ లో గల
సర్వే నంబర్ 236 లో దాదాపు 2 కోట్లు విలువైన భూమిని కొల్లగొట్టే ప్రయత్నంలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, సంపన్నులు కుట్రలు చేస్తున్నారని అన్నారు. 24 సంవత్సరాల క్రితం సర్వే నంబర్ 236 గణేష్ నగర్ లో అప్పటి అధికారులను మచ్చిక చేసుకున్న కొందరు వ్యక్తులకు తలా 10 గుంటల భూమిలో వ్యవసాయం చేసుకునేందుకు పాస్ పుస్తకాలు ఇచ్చారని కానీ ఆ భూములలో నేటి వరకు ఎలాంటి వ్యవసాయము చేయకపోవడంతో గత ప్రభుత్వం నిరుపేదలకు డబల్ బెడ్రూంలు కట్టి ఇచ్చేందుకు ఆ భూములు పొందినవారికి ప్రభుత్వం నోటీసులు ఇచ్చి స్వాధీనం చేసుకున్నారు అని అన్నారు. ప్రస్తుతం ఆ భూములకు డిమాండ్ పెరగడంతో మళ్ళీ వారే ఇప్పుడు రెవెన్యూ అధికారుల అండతో పట్టాలు చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వ భూములను కాపాడి ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు కృషిచేయాలని కోరారు.
#లోకల్ యాడ్స్#
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: మనిషా డిజిటల్ ఫోటో స్టూడియో అండ్ వీడియో గ్రాఫర్స్ హుజురాబాద్.





