
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: సమాజానికి ఉపయోగపడే జర్నలిస్టుల సంక్షేమానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఆదివారం హుజురాబాద్ పట్టణంలోని మధువని గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా శాఖ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….నాటి సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తాను ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట మండలాలకు చెందిన జర్నలిస్టులకు ఇళ్ల పట్టా భూములు ఇప్పించామని అన్నారు. ఇంతే కాకుండా కమలాపూర్ మండలంలోని జర్నలిస్టులకు కూడా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టా భూములు అందజేశామని గుర్తు చేశారు. హుజురాబాద్లో జర్నలిస్టులకు గతంలో కేటాయించిన పట్టా భూములపై కొంతమంది కాంగ్రెస్ నాయకులు కోర్టులో కేసులు వేసి అడ్డంకులు సృష్టించారని ఎమ్మెల్యే ఆరోపించారు. జర్నలిస్టులకు కేటాయించిన ఆ భూములను తిరిగి వారికి అందించేలా ప్రభుత్వంతో పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే ఎంతవరకైనా పోరాటం చేసి జర్నలిస్టుల హక్కును కాపాడుతానని స్పష్టం చేశారు.
కొంతమంది జర్నలిస్టులకు పెండింగ్లో ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులను తానే స్వయంగా చెల్లిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. విలేకరి సోదరులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను అందుబాటులో ఉంటానని, జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని అన్నారు.జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్నారని, వారి సంక్షేమం కోసం తన వంతు సహకారం ఎల్లప్పుడూ కొనసాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

ఐజెయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు నగునూరి శేఖర్ మాట్లాడుతూ.. తాను జర్నలిస్టుల కు శాఖాపరంగా వచ్చే ఇబ్బందులపై పోరాటం చేయడమే కాకుండా హెల్త్ కార్డులు, అక్రిడియేషన్ కార్డులు, ఇంటి స్థలాలు తదితర విషయాలపై పోరాటం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఐజేయూ జిల్లా శాఖ అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలగందుల రవీందర్, కోశాధికారి వెంకటేష్, ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి రవీందర్, హుజురాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాయిత రాములు, జిల్లా ఉపాధ్యక్షులు గాండ్ల సంపత్, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సుకూర్, ఉపాధ్యక్షులు భరణి కుమార్, సంయుక్త కార్యదర్శి కొండల్ రెడ్డి, తిరుపతి, అధ్యక్షులు శైలేందర్, సంపత్ కుమార్, జిల్లా ఈసీ నెంబర్ సత్యరాజ్, మహేంద్ర చారి, సీనియర్ మామిడి రవీందర్ గౌడ్, టి ఆంజనేయస్వామి, కోరెం సుధాకర్ రెడ్డి, పరాంకుశం కిరణ్ కుమార్, కే నరసింహారెడ్డి, కే శ్రీధర్, జే మహేష్, పి సతీష్, సంపత్, టి సాగర్, రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
&లోకల్ యాడ్స్&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: మనీషా డిజిటల్ ఫోటో స్టూడియో అండ్ వీడియో గ్రాఫర్స్ హుజురాబాద్.





