
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ లోని రంగనాయకుల గుట్ట వద్ద ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గత సంవత్సరం నిర్మించుకున్న పెద్దమ్మతల్లి ఆలయంలో కి,శే,లు రావనవేణి మురళి (ఎస్.టి.ఓ) జ్ఞాపకార్దమ్ వారి సతీమణి విమల, కొడుకులు సాయిరాం, వంశీలు అమ్మవారికి అరకిలో వెండి కిరీటాన్ని బహుకరించారు.

ఈ సందర్భంగా పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి ఆలయ కమిటీ, ముదిరాజ్ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో వేదమాత్రాల మధ్య అమ్మవారికి సమర్పించి అలంకరించారు. అనంతరం కిరీట దాతలను సన్మానించిన ముదిరాజ్ సంఘం సభ్యులు మాట్లాడుతూ ఆషాఢమాసం సందర్భంగా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో 5వ తేదీన పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి, 6వ తేదీన శ్రీ పెద్దమ్మతల్లికి అంగరంగ వైభవంగా భోనాల పండుగ నిర్వహిచబడుతుందని తెలిపారు. ఈ పండుగలో పుర ప్రజలు అందరు పాల్గొని పెద్దమ్మతల్లి కృపా కటాక్షాలను పొందాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ, ముదిరాజ్ సంఘం సభ్యులు గుడ్డేలుగుల సమ్మయ్య, పోచయ్య, గోస్కుల సమ్మయ్య, వెంకన్న, కొలిపాక సమ్మయ్య, మౌటం శ్రీనివాస్, పిల్లి సమ్మయ్య, భూమ్ సాయికృష్ణ, రావనవేణి రాజేశం, రమేష్, భాస్కర్, బుర్రి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
@లోకల్ యాడ్స్@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: నాగార్జున మిల్క్ ప్రొడక్ట్స్ డెయిరీ & గణపతి సీడ్స్, పరకాల క్రాస్ రోడ్ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





