Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ మున్సిపల్ పరిధిలో నిర్మాణం చేపట్టిన డబుల్ బెడ్ రూంలను తమ వార్డు లోనీ సొంత ఇల్లు లేని అర్హులైన పేద ప్రజలకు ఇండ్లు కేటాయించాలని 26వ వార్డు కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య వినతి పత్రం అందచేశారు. సోమవారం హుజూరాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారితో పాటు మున్సిపల్ కమిషనర్ కిషన్ కు వార్డులో అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్న పలువురు పేర్లతో కూడిన దరఖాస్తును ప్రజావాణిలో అందచేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….తమ వార్డు లో 45 మంది గత ప్రజాపాలన లో భాగంగా దరఖాస్తు చేసుకోగా అందులో 20 కుటుంబాలకు చెందిన వారు అద్దె ఇండ్ల లో ఉంటూ దుర్భర జీవితం గడుపుతున్నారని అన్నారు. గతం లో భూములు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నుండి సూచిస్తుందని కొంత మంది నీ తోలగించే ప్రయత్నం చేయడం తగదన్నారు. తాతలు ముత్తాత ల నుండి ఉన్న భూములు, ఇండ్ల ను అర్హులైన లబ్ధిదారుల పై సొంతంగా ఉన్నట్లు సూచిస్తున్నాయని పేర్కొనడం తగదన్నారు. వార్డు లో వార్డు సభలు నిర్వహించడం తో పాటు అధికారులు స్వయంగా దరఖాస్తు దారుల ఇండ్ల ల్లోకి వచ్చి పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. వార్డు లో సభ నిర్వహించి ప్రజల్లో అర్హులను నిర్ధారించాలని, నిజమైన లబ్ధిదారుల కు న్యాయం చేయాలని అన్నారు . తాము పేర్కొన్న దరఖాస్తు దారులకు ఎలాంటి ఇండ్లు, స్థలాలు లేవని,ఇందుకోసం వార్డు సభ నిర్వహించాలని ప్రజల సమక్షంలో దర్యాప్తు చేపట్టాలని కోరారు. 26 వార్డు లో ఇండ్లు స్వంతం గా ఉంటే మున్సిపల్ లో ఇల్లు, నల్ల పన్నులు చెల్లించే పేర్లు మున్సిపల్ సిబ్బంది అధీనం లో నీ ఉంటాయని, కనీసం ఆ కుటుంబాల పేర్ల మీద ఎక్కడైనా విద్యుత్ బిల్లు లు చెల్లించిన ఎంపిక లో పేరును తొలగించాలని విజ్ఞప్తి చేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం లో కూడా ఎలాంటి సెంట్ భూములు లేవని, రాష్ట్రం లో, దేశంలో ఏ ప్రాంతంలో కూడా ఎలాంటి భూములు, ఇండ్లు, ఆస్తులు లేవని వీరి పేర్ల పై అఫిడవిట్ ఇవ్వడమే గాకుండా వారి పేర్లపై ఏమైనా ఉంటే స్వాధీనం చేసుకోవాలని వినతి చేయడం జరిగింది. తను వార్డు ప్రజల మన్నన తో 4 సార్లు ఒకే వార్డు నుండి వార్డు సభ్యులు గా కౌన్సిలర్ గా గెలుపొందామని నిజమైన అర్హులు ఇండ్లు కోల్పోవద్దని అన్నారు. తాము ఇచ్చిన వినతి పై స్పందించకుండా ఉండి, అర్హులకు ఇండ్లు రాకపోతే లబ్ధిదారుల ముందే కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తామని అన్నారు. రెవిన్యూ, మున్సిపల్ అధికారులు వార్డు లో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబాన్ని విచారణ చేపట్టాలని కోరారు. ఇంతేకాకుండా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఓడితేల ప్రణవ్ బాబు, చైర్ పర్సన్ రోంటాల సుహాసిని లకు వినతి పత్రంలను అందచేశారు.
##లోకల్ యాడ్స్##
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: నాగార్జున మిల్క్ ప్రొడక్ట్స్ డెయిరీ & గణపతి సీడ్స్, పరకాల క్రాస్ రోడ్ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





