Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 16 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హుజురాబాద్ ప్రాజెక్టు సిడిపిఓ మరాఠీ సుగుణ తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ…
హుజూరాబాద్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడి టీచర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల అయిందని, ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇంటర్మీడియట్ అర్హత ఉన్న మహిళలు మాత్రమే పోస్టులకు అర్హులని, అభ్యర్థి సంబంధిత అంగన్వాడి కేంద్రం పరిధిలోని గ్రామపంచాయతీలో, హుజురాబాద్ మున్సిపాలిటీలో అయితే సంబంధిత వార్డులో స్థానికురాలు స్థానికురాలు అయి ఉండాలనే అన్నారు.
01.07.2026 నాటికి 18 నుండి 35 సంవత్సరాలు లోపు మహిళలు అర్హులని తెలిపారు. ఖాళీల వివరాలు, ఎంపిక ప్రక్రియ, రిజర్వేషన్ తదితర వివరాల కోసం https://wdcw.tg.nic.in వెబ్ సైట్ ను సందర్శించాలని, ఈ వెబ్సైట్ ద్వారానే దరఖాస్తులు సమర్పించాలని ఆమె తెలిపారు.
సైదాపూర్ మండలం లో ఖాళీల సంఖ్య 06
1.సైదాపూర్-1(OC),
2.సైదాపూర్-2 (SC group-II),
3.గొడిశాల-1(OC)
4.గొడిశాల-2(SC group-II)
5.దుద్దెనపల్లి-1(SC group-III),
6.సర్వాయిపేట (SC group-III),
వీణవంక మండలంలో ఖాళీల సంఖ్య 1,
రెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తపల్లి ,
జమ్మికుంట మండలంలో ఖాళీల సంఖ్య 05,
1.గండ్రపల్లి(Ex-s/OC),
2.నాగంపేట(ST),
3.వెంకటేశ్వర్లపల్లి పంచాయతీ పరిధిలోని గోవిందాపూర్(SC group-II),
4.బిజిగిరి షరీఫ్ పరిధిలోని మొల్లపల్లి(BC-E),
5.గండ్రపల్లి పరిధిలోని ఒడ్డెర వాడ(BC-A).
ఇల్లందకుంట మండలంలో ఖాళీల సంఖ్య 1,
గడ్డివానిపల్లి(BC-C)
హుజురాబాద్ మండలం ఖాళీల సంఖ్య 03,
శాలపల్లి(EWS),
.రాంపూర్ పరిధిలోని గొల్లపల్లి(BC-D)
హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని కుమ్మరివాడ లో ఖాళీ ఉందని అర్హులైన వారు మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
##లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: నాగార్జున మిల్క్ ప్రొడక్ట్స్ డెయిరీ & గణపతి సీడ్స్, పరకాల క్రాస్ రోడ్ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





