
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజూరాబాద్ (సైదాపూర్): కాలక్షేపం కోసం తోటి స్నేహితులతో కలిసి చేసుకున్న సరదా విందు ఆ ఇంట్లో తీరని శోకాన్ని నింపింది. స్నేహితుల మధ్య తలెత్తిన స్వల్ప వివాదం కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీయడంతో, కన్నేసిన క్రూరత్వంతో ఒక యువకుడి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. తోటి స్నేహితులే సుత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసిన ఘాతుకం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఘన్పూర్ వద్ద చోటుచేసుకుంది.

స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు:
శంకరపట్నం మండలం మెట్టుపల్లి గ్రామానికి చెందిన పల్లె అజయ్ (యువకుడు) హుజూరాబాద్ పట్టణంలోని ఏ టు జడ్ బైక్ మెకానిక్ షాపులో మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూలాగే పని ముగించుకున్న అజయ్, సోమవారం సాయంత్రం తోటి మెకానిక్ స్నేహితులతో కలిసి సైదాపూర్ మండలం ఘన్పూర్ పరిసర ప్రాంతంలో విందు (మద్యం సేవించేందుకు) ఏర్పాటు చేసుకున్నారు.
విందు సజావుగానే సాగినప్పటికీ, తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్తున్న క్రమంలో స్నేహితుల మధ్య ఏ విషయమైందో కానీ మాటమాట పెరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆవేశంతో ఊగిపోయిన తోటి స్నేహితులు తమ వెంట తెచ్చుకున్న బైక్ రిపేరింగ్ సుత్తితో అజయ్ తలపై తీవ్రంగా బాదారు. బలమైన దెబ్బలు తగలడంతో అజయ్ రక్తమడుగులో ఘటనా స్థలంలోనే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. అజయ్ మృతి చెందినట్లు గ్రహించిన నిందితులు అక్కడి నుండి పరారయ్యారు.
ఘటనా స్థలిలో విషాదఛాయలు – పోలీసుల విచారణ:
సోమవారం రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే సైదాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై స్వాతి, పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి కీలక ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న తోటి మెకానిక్ స్నేహితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మద్యం మత్తులో జరిగిన గొడవే హత్యకు కారణమా? లేక పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని రూరల్ సీఐ వి శ్రీనివాస్, ఎస్సై స్వాతి లు తెలిపారు. అజయ్ అకాల మరణంతో మెట్టుపల్లి గ్రామంలో మరియు ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది.
#లోకల్ యాడ్స్#
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మరియు ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ రొంటాల సుహాసిని – మనోజ్ రావు గారు, చైర్పర్సన్ పురపాలక సంఘం హుజురాబాద్.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ గుడిపాటి సరిత జైపాల్ రెడ్డి గారు, జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు (సింగాపూర్) హుజురాబాద్.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ తాళ్లపల్లి స్వప్న – వెంకటేష్ గారు, గ్రా: సర్పంచ్ జూపాక, మండలం హుజురాబాద్.. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హుజురాబాద్.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ పెరుమాండ్ల హైమ బిక్షపతి గారు, గ్రా: కాట్రపల్లి సర్పంచ్, మండలం హుజురాబాద్.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.





