
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు హుజూరాబాద్ పట్టణంలో అత్యంత వేడుకగా, కోలాహలంగా జరిగాయి. పట్టణంలోని 29వ వార్డు పరిధిలోని గాంధీనగర్ ఎక్లేషియా మినిస్ట్రీస్ గాస్పల్ చర్చిలో స్థానిక 29వ కౌన్సిలర్ బోరగాల మొగిలి ఆధ్వర్యంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా చర్చి పాస్టర్ డేవిడ్ రాజు నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోగ్యం, సుదీర్ఘ జీవితం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం నాయకులు, కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. వేడుకల్లో భాగంగా కౌన్సిలర్ పేదలకు మరియు బిలీవర్లకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు కాజీపేట శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుక్షణం రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అహరహం కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజానాయకుడిగా ఆయన నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సొల్లు బాబు, చేనేత సెల్ జిల్లా అధ్యక్షుడు బండారి సదానందం, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చల్లూరి రాహుల్, 9వ వార్డు కౌన్సిలర్ ఇల్లందుల సమ్మయ్య, సామాజికవేత్త వేల్పుల రత్నంలతో పాటు చర్చి నిర్వాహకులు, కాంగ్రెస్ శ్రేణులు, పెద్ద ఎత్తున భక్తులు (బిలీవర్స్) పాల్గొని ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మరియు ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ రొంటాల సుహాసిని – మనోజ్ రావు గారు, చైర్పర్సన్ పురపాలక సంఘం హుజురాబాద్.
*దీపావళి శుభాకాంక్షలు*

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ గుడిపాటి సరిత జైపాల్ రెడ్డి గారు, జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు (సింగాపూర్) హుజురాబాద్.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ తాళ్లపల్లి స్వప్న – వెంకటేష్ గారు, గ్రా: సర్పంచ్ జూపాక, మండలం హుజురాబాద్.. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హుజురాబాద్.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ పెరుమాండ్ల హైమ బిక్షపతి గారు, గ్రా: కాట్రపల్లి సర్పంచ్, మండలం హుజురాబాద్.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.





