
- మంత్రికి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన చైర్పర్సన్.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (సైదాపూర్) :
తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మరియు మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు సైదాపూర్ గ్రామంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామానికి చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ (HM) కొత్త మల్లారెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ, ఆప్యాయంగా పలకరించారు.
మంత్రికి శాలువాతో సన్మానం – దీపావళి శుభాకాంక్షలు:
అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మంత్రికి జ్ఞాపిక ఇచ్చి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గ మరియు మండల అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమానికి మంత్రి అందిస్తున్న సేవలను ఆమె కొనియాడారు.
భారీగా తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు:
ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాల్గొన్న వారిలో:
సైదాపూర్ గ్రామ సర్పంచ్ మునిగంటి స్వప్న,
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సిహెచ్ కొండల్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ దొంత సుధాకర్, వెనుక పల్లి సర్పంచ్ సునీత, మాజీ సర్పంచ్ కొండ గణేష్, వెన్నంపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు పంతంగి రవీందర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు సారబుడ్ల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ మండల మహిళా అధ్యక్షురాలు పుల్ల రాధ, స్థానిక సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని,
గ్రామంలో మంత్రి పర్యటన సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రజలతో కలిసి సమయం గడిపిన మంత్రి, గ్రామ పరిధిలోని పలు సమస్యలపై కూడా స్థానికులతో ఆరాతీశారు. అలాగే పద్మశాలి కుల సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ చేనేత సెల్ జిల్లా అధ్యక్షుడు బండారి సదానందం ఆధ్వర్యంలో మార్త రవీందర్ సంగం శ్రీనివాస్, పోగు రమేష్ తదితరులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మరియు ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ రొంటాల సుహాసిని – మనోజ్ రావు గారు, చైర్పర్సన్ పురపాలక సంఘం హుజురాబాద్.
*దీపావళి శుభాకాంక్షలు*

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ గుడిపాటి సరిత జైపాల్ రెడ్డి గారు, జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు (సింగాపూర్) హుజురాబాద్.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ తాళ్లపల్లి స్వప్న – వెంకటేష్ గారు, గ్రా: సర్పంచ్ జూపాక, మండలం హుజురాబాద్.. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హుజురాబాద్.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ పెరుమాండ్ల హైమ బిక్షపతి గారు, గ్రా: కాట్రపల్లి సర్పంచ్, మండలం హుజురాబాద్.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.





