
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అమలవుతున్న రోస్టర్ విధానం వల్ల ఎస్సీ వర్గాల్లోని మెజార్టీ కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఈ విధానాన్ని వెంటనే సవరించాలని తెలంగాణ మాల మహానాడు హుజురాబాద్ శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం హుజూరాబాద్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్‌కు సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేసిన సుమారు 20 ఉద్యోగ నోటిఫికేషన్లలో అమలు చేస్తున్న రోస్టర్ పద్ధతి అత్యంత లోపభూయిష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ (ఏబిసిడి ) పేరుతో అశాస్త్రీయంగా రూపొందించిన ఈ విధానం వల్ల ఎస్సీల్లోని మెజార్టీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదని, ఫలితంగా ఉద్యోగ, ఉపాధి, విద్యా రంగాల్లో వారు తీవ్ర వివక్షకు గురవుతున్నారని మండిపడ్డారు.
ప్రస్తుతం ఉన్న రోస్టర్ విధానాన్ని సమగ్రంగా సమీక్షించి, శాస్త్రీయంగా సవరించేంత వరకు ప్రభుత్వం ఉద్యోగ నియామక ప్రక్రియలన్నింటినీ తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు తొగరు స్వామి, పసుల స్వామి, జూపాక శ్రీనివాస్, జూపాక నర్సింగం తదితరులు పాల్గొన్నారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మరియు ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ రొంటాల సుహాసిని – మనోజ్ రావు గారు, చైర్పర్సన్ పురపాలక సంఘం హుజురాబాద్.
*దీపావళి శుభాకాంక్షలు*

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ గుడిపాటి సరిత జైపాల్ రెడ్డి గారు, జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు (సింగాపూర్) హుజురాబాద్.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ తాళ్లపల్లి స్వప్న – వెంకటేష్ గారు, గ్రా: సర్పంచ్ జూపాక, మండలం హుజురాబాద్.. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హుజురాబాద్.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ పెరుమాండ్ల హైమ బిక్షపతి గారు, గ్రా: కాట్రపల్లి సర్పంచ్, మండలం హుజురాబాద్.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.





