
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ : హుజూరాబాద్ పట్టణం తెనుగువాడకు చెందిన గుడ్డేలుగుల సమ్మయ్య (తండ్రి: చిన్న కొమురయ్య) కనిపించకుండా పోయి దాదాపు ఏడాది కావస్తున్నా ఇంకా ఆచూకీ లభించకపోవడంతో ఆయన కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.

గత సంవత్సరం (23.03.2025) న సమ్మయ్య అకస్మాత్తుగా కనపడకుండా పోవడంతో కుటుంబసభ్యులు హుజూరాబాద్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు (F.I.R No: 106/2025). కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరియు కుటుంబ సభ్యులు ఎంతగానో వెతికినప్పటికీ సమ్మయ్య ఆచూకీ లభించలేదు. ఇంటి పెద్దదిక్కు లేకపోవడంతో ఆయన భార్య నర్సమ్మ, కుమారుడు రాకేష్, కుమార్తె సాయిశృతిలు తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నారు.

ఈ సందర్భంగా ‘స్వర్ణోదయం’ యూట్యూబ్ ఛానెల్‌తో తమ ఆవేదనను పంచుకుంటూ — తండ్రిని వెతుకుతూ కొడుకు రాకేష్ ఇప్పటికే పలు జిల్లాలు తిరిగినా ఫలితం లేకుండా పోయిందని కన్నీటిపర్యంతమయ్యారు.
మానవతా దృక్పథంతో సహాయం చేయండి:
సమ్మయ్య ఆచూకీ తెలిసిన వారు వెంటనే స్పందించి సమాచారం అందించాల్సిందిగా కుటుంబ సభ్యులు చేతులు జోడించి వేడుకుంటున్నారు. సమ్మయ్యను సురక్షితంగా తమకు కానీ, పోలీసులకు కానీ అప్పగించిన వారికి ₹20,000 (ఇరవై వేల రూపాయలు) నగదు బహుమతిగా అందజేస్తామని తెలిపారు.
సమాచారం అందించాల్సిన ఫోన్ నంబర్లు:
హుజూరాబాద్ ఎస్.ఐ (రవి గారు): 99490 51595
కుటుంబ సభ్యులు: 72888 12890





