
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని పాత టెలిఫోన్ ఎక్స్చేంజి ఆఫీస్ వీధిలో మంగళవారం కోతులు దాడి చేయడంతో ఎక్కేటి లలిత అనే గృహిణి తీవ్రంగా గాయపడింది. ఆ వీధిలో కోతుల గుంపు వెళుతుండగా ఇంట్లో ఉన్న లలిత పైపైకి కోతులు రావడంతో ఆమె తీవ్రంగా భయాందోళనకు గురైంది. తీవ్రంగా గాయపడ్డ ఆమె ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంది. పట్టణంలో కోతుల బెడద నుండి ప్రజలను కాపాడాలని 21వ వార్డు కౌన్సిలర్ పంజాల మనోజ్ కోరారు.

కోతుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ మహిళ





