
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : పాత మార్కెట్ స్థలంలోని మార్కెట్ ను నిర్వహించాలని కోరుతూ బుధవారం హుజురాబాద్ పట్టణంలోని పాత మార్కెట్ వ్యాపారస్తులు బంద్ నిర్వహించారు. 27వ వార్డ్ కౌన్సిలర్ కోయల్ కార్ భారతి ఆధ్వర్యంలో వ్యాపారస్తులంతా పట్టణంలో ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా రోడ్లమీద బజారు బతుకులు బేజారు మన మార్కెట్ మనకే కావాలి అంటూ నినాదాలు చేశారు. ర్యాలీగా వెళ్లి మున్సిపల్ కమిషనర్ బి కిషన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వం 1.26 కోట్ల రూపాయలతో రైతుబజార్ నిర్మించింది అని అది మూడేళ్లుగా నిరుపయోగంగా ఉందన్నారు. మార్కెట్‌ను పాత ప్రదేశంలో నడపకపోవడం వల్ల ఈ ప్రాంతంలో మార్కెట్ పై ఆధారపడి వ్యాపారం చేసుకునే దుకాణాలన్నీ నష్టపోయాయని వ్యాపారాలు జరగక ఈ ప్రాంత వ్యాపారస్తులు తీవ్ర కష్టాల్లో ఉన్నారని చెప్పారు. కేవలం కొంతమంది మారు బేరం చేసే వ్యాపారుల ప్రయోజనం కోసమే మార్కెట్ ను మున్సిపల్ ప్రాంతంలో నడుపుతున్నారని ఆరోపించారు. ప్రజల సౌకర్యార్థం పాత మార్కెట్ స్థలంలోకి మార్కెట్‌ను తీసుకొని రావాలని అన్నారు. ప్రజల కోరిక మేరకు 30 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి తీర్మానం చేసినప్పటికీ మార్కెట్ ను పాత స్థలంలో ఎందుకు నిర్వహించలేకపోతున్నారని వారన్నారు. తాము పెట్టుబడి పెట్టి వ్యాపారాలు నడవక తీవ్ర అప్పుల్లో ఉన్నామని, ప్రతాప్ వాడ రజక వాడ పోచమ్మ వాడ యాదవ వీధి కుమ్మరివాడ తదితర ప్రాంతాల ప్రజలకు పాత మార్కెట్ స్థలంలో నిర్వహించడం వల్ల ప్రయోజనం కలుగుతుందని దూర భారం ఉండదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పాత మార్కెట్ ఉన్న స్థలంలోనే మార్కెట్ ను నిర్వహించాలని, వ్యాపారులకు సైతం సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో కోయల్ కార్ బాలాజీ, మాజీ వార్డు కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కోయల్ కార్ సమన్, మోసం మార్కండేయ, క్యాస రమేష్, బల్లు పున్నoచందర్, గోగికార్ అనిల్, సంగెం భాస్కర్, కొమురవెల్లి సంతోష్, ఎండి ఇసాక్, లడ్డు కౌసర్, ఆర్ రాజు, అశోక్, ప్రకాష్, సంపత్, ముషం తిరుపతి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.





