
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్
కరీంనగర్ మాజీ ఎంపీ బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్ వివాహ వార్షికోత్సవ వేడుకలు పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం హుజురాబాద్ పట్టణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపించారు. మరెన్నో పెళ్లిరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, కౌన్సిలర్ వర్దినేని రవీందర్ రావు సర్పంచ్ మల్లారెడ్డి మండలాధ్యక్షుడు సంఘం ఐలయ్య తలకొక్కుల హరిప్రసాద్, తులసి లక్ష్మణమూర్తి, శ్రీనివాస్ ,తదితరులు పాల్గొన్నారు.




