
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: స్థానికంగా చాలా కాలం నుండి నిరుపయోగంగా, పెండింగ్లో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలే భవన నిర్మాణ స్థలాన్ని ‘హుజురాబాద్ మార్నింగ్ ఫ్రెండ్స్’ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న భవన నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించి పూర్తి చేసేందుకు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు వర్దినేని రవీందర్ రావు ముందుకు వచ్చారు.


భవన స్థలాన్ని పరిశీలించిన అనంతరం రవీందర్ రావు మాట్లాడుతూ.. మహనీయుల ఆశయాలకు అనుగుణంగా నిర్మిస్తున్న ఈ భవనం అర్ధాంతరంగా నిలిచిపోవడం బాధాకరమని అన్నారు. ఈ భవన నిర్మాణానికి తన వంతు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. పనులు ప్రారంభించి, భవన నిర్మాణం పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసేది లేదని ఆయన స్పష్టం చేశారు. సమాజ హితం కోసం నిర్మిస్తున్న ఈ భవనాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురావడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, నాగార్జున పాల డైరీ చైర్మన్ ప్రభాకర్ రావు, సర్పంచ్ కట్కూరి మల్లారెడ్డి, కేశిరెడ్డి నరసింహారెడ్డి, సంఘం ఐలయ్య, పాక సతీష్, సోల్లు బాబు, కొలిపాక శంకర్, చింత శ్రీను, ద్వారక, సమ్మయ్య, సాయి, అంపటి సతీష్, పిట్ట మొగిలి, కానుగంటి శీను, కొలిపాక మహేష్, జై కే సత్యనారాయణ, నీరటి రమేష్, గనిశెట్టి సాంబశివ, కత్తెరమళ్ళ సదానందం తదితరులు పాల్గొన్నారు.




