
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని పాత రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఆర్కే బిల్డర్స్‌లో భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకుని రూ.50 వేల నగదు, 20 తులాల వెండిని అపహరించారు.

ఆర్కే బిల్డర్స్‌లో నివాసం ఉంటున్న సింగిరెడ్డి లక్ష్మి(విజయ) తన కుమార్తె ఇంటికి హైదరాబాద్‌కు వెళ్లారు. ఆమె ఇంట్లో లేని విషయాన్ని గమనించిన దుండగులు రాత్రి సమయంలో ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి నగదు, తులం బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. గురువారం తెల్లవారుజామున ఇంటి తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించిన పక్కింటి వారు బాధితురాలు లక్ష్మికి సమాచారం అందించారు. అయితే విజయ రూమ్‌లో తులం విలువచేసే ఉంగరాలు, రూ 50 వేల నగదు దాచిపెట్టగా కనిపించకుండా పోయాయి. అలాగే కోడలు రూములో భద్రపరిచిన పెద్ద ఎత్తున వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలిపారు.

పూజా గదిలోని తులం బంగారు ఉంగరాలు, వెండి వస్తువులు చోరీ అయినట్లు తెలుపుతున్న బాధితురాలు సోదరి.


బీరువాలో, కబోర్డులో దాచిపెట్టిన నగదు, వెండి వస్తువులను చోరీ చేసినట్లు తెలుపుతున్న బాధితురాలు సోదరి..
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ చోరీ నిన్న సాయంత్రమే జరిగి ఉండొచ్చు అని స్థానికులు పేర్కొన్నారు. గుర్తుతెలియని ముగ్గురు ఆడవాళ్లు ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో సంచరించినట్లు తెలిపారు. ముందు గేటు పక్కన మెట్ల మీదకెళ్ళి లోపలికి దొరికి ముందు రూములోని డోర్ తాళం రంపంతో కోసినట్లుగా కనిపిస్తుందన్నారు. బాధితురాలు హైదరాబాదు నుండి హుటాహుటిన హుజురాబాద్ కు బయలుదేరింది. బాధితురాలు వచ్చి పూర్తిగా పరిశీలిస్తే పూర్తి వివరాలు తెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పట్టణంలోని నివాస ప్రాంతాల్లో చోరీ జరగడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు.




