Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దైవ దర్శనానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో మహిళా ప్రయాణికురాలికి గుండెపోటు రావడంతో హుజురాబాద్ లో ఆమె మృతి చెందింది. వివరాలలోకి వెళితే… ఉమ్మడి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొండపాక గ్రామానికి చెందిన దండు సుగుణమ్మ (65) తన కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ జాతరకు వెళ్ళింది. అక్కడ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత వేములవాడ డిపో బస్సులో వరంగల్ కు వెళ్తుంది. కాగా హుజురాబాద్ సమీపంలోకి వచ్చేసరికి ఆమెకు గుండె నొప్పి వస్తుందని తన కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు ఈ విషయాన్ని కండక్టర్‌కు తెలిపి 108కి ఫోన్ చేశారు హుజురాబాద్ బస్టాండ్ వరకు వచ్చేసరికి కుటుంబ సభ్యులు గుండె నొప్పి రాకుండా ప్రధమ చికిత్స చేయడానికి ప్రయత్నించారు. బస్సు హుజురాబాద్ బస్టాండ్ లోకి వచ్చేసరికి సిద్ధంగా ఉన్న 108 సిబ్బంది వెంటనే ఆమెకు వాహనంలో సిపిఆర్ చేశారు. అనంతరం హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకొని వెళ్లగా వైద్యులు ఆమె ఇప్పటికే మృతి చెందిందని తెలిపారు. దీంతో సుగుణమ్మ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.




