Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: స్థానిక మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల (కేసీ క్యాంపు)కు చెందిన విద్యార్థిని పి.లాప్సిక జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపికై సత్తా చాటింది.
ఇటీవల నిర్మల్ జిల్లా బీబీనగర్‌లో ఈ నెల 11 నుండి 13 వరకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGFI) అండర్-14 రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొన్న లాప్సిక అత్యంత ప్రతిభ కనబరిచి, అద్భుతమైన క్రీడా నైపుణ్యంతో జాతీయ స్థాయి జట్టులో స్థానం సంపాదించుకుంది.
గ్రామీణ నేపథ్యం నుండి వచ్చి రాష్ట్ర స్థాయిలో రాణించి, జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ తాళ్లపల్లి శారద హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లాప్సికను మరియు ఆమెకు శిక్షణ ఇచ్చిన పీఈటీ చిరుత కవితను ప్రిన్సిపాల్ శారద ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించి పాఠశాలకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఉపాధ్యాయ బృందం ఆకాంక్షించింది.




