
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ స్కూల్ లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల నుండి వేణుమాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.



ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలర్పించిన సమరయోధుల త్యాగాలను, వారి పోరాట స్ఫూర్తిని వివరించారు. దేశ సమగ్రత, ఐక్యత, శాంతి, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు తమలోని ప్రతిభను దేశాభివృద్ధికి ఉపయోగించాలని, స్వాతంత్ర్య సమరయోధుల కలలను సాకారం చేసే బాధ్యత నేటి యువతపైనే ఉందన్నారు. ఈ సందర్భంగా అందరికీ ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు జాతీయ జెండాలు చేతబూని, దేశభక్తి నినాదాలు చేస్తూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తిని చాటే ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతి, ఆచార వ్యవహారాలు, వేషధారణలు ఉట్టిపడేలా ఉపాధ్యాయునీలు ప్రదర్శించిన నృత్య నాటిక అందరినీ అలరించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
@@లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: కాకతీయ జూనియర్ కళాశాల హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





