
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని సైదాపూర్ మండల్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ యూనియన్ మండల అధ్యక్షులు తిప్పిరిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. అలాగే నూతన కమిటీనీ సభ్యుల అందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా బొల్లం నాగేంద్రబాబు, గౌరవ అధ్యక్షులు చందా రమేష్, ఉపాధ్యక్షులుగా పోతారం రాహుల్, గుర్రం కుమారస్వామి, ప్రధాన కార్యదర్శిగా బొడిగె చంద్రమౌళి, కోశాధికారిగా అనుగోని ప్రణయ్, ముఖ్య సలహాదారుడుగా అనగోని, సతీష్. సహాయ కార్యదర్శిగా బొల్లం అభిలాష్, ఆర్గనైజర్ గా సుద్దాల నర్సింగం, కార్యవర్గ సభ్యులుగా మంచికట్ల శ్రీకాంత్ , వెల్ది పరుశరాములు, బోరగాళ్ల రమేష్ , పంజాల అరుణ్ ,అనగోని వంశీ, బొల్లం దినేష్ లను ఎన్నుకోవడం జరిగిందన్నారు.





