
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎల్ నినో ప్రభావం వల్ల ప్రజలకు తాగు, సాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు భూగర్భ జలాల పెంపుకు కృషి చేయాలని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ సూచించారు. మంగళవారం హుజూరాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఆరు మండలాల ఎంపీడీవోలు ఎంపీవోలుతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఆరు మండలాల ఎంపీడీవోలు ఎంపీవోలుతో సమీక్షా సమావేశం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…భూగర్భ జలాల పెంపు కోసం హుజురాబాద్ మండలం అన్ని గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ను అధికారులు తయారు చేయాలన్నారు, ఫార్మ్ పాండ్స్, ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్ లను నిర్మించాలని వాటిని ప్రోత్సహించాలన్నారు. అన్ని గ్రామాలలో నీటి వనరుల పెంపు కోసం అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలన్నారు.


పైలెట్ ప్రాజేక్టులో భాగంగా గ్రామ పంచాయతీ పెద్దపాపయ్యపల్లి సమగ్ర అభివృద్ధి ప్రణాళికను ఆన్ లైన్ నందు డాట నమోదును పరిశీలించారు. గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక, విబిజి రాంజీ పథకానికి సంబంధించిన వివిధ అంశాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని సింగాపూర్ లో తయారుచేసిన ఫామ్ పాండును ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సమావేశంలో డిఎల్పిఓ శ్రీనివాస్, ఎంపీడీవో తూర్పాటి సునీత, పలువురు అధికారులు పాల్గొన్నారు.
##లోకల్ యాడ్స్ ##
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: కాకతీయ జూనియర్ కళాశాల హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





