Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పేదింటి ఆడబిడ్డల పెళ్లి కోసం మేనమామల మాజీ సీఎం కేసీఆర్ ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీకి ఏదింటి ఆడబిడ్డలపై కోపం ఎందుకని వెంటనే కళ్యాణ లక్ష్మి కొనసాగించాలని బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం హుజురాబాద్ తాసిల్దార్ కార్యాలయం ముందు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని బిఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఎన్నో వాగ్దానాలు చేసి అలవి గాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం కేసీఆర్ పెట్టిన మంచి పథకాలను రద్దు చేయాలని కుట్రతోనే కోర్టులో ప్రభుత్వం సమాధానం చెప్పలేదన్నారు. డబ్బుతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి ప్రస్తుతం దానిని ఆపివేయడం కోసం కొత్త కుట్రలకు కాంగ్రెస్ పార్టీ తెరదీసిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కోర్టులో తమ విధానాన్ని స్పష్టం చేసి వెంటనే ఆడబిడ్డల కు ప్రయోజనం కలిగించే కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ పథకంపై స్పష్టమైన విధానం ప్రకటించకపోతే పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి, ఈ సమస్యను జనంలోకి తీసుకెళ్లి ప్రజలకు వివరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కౌన్సిలర్లు కేశిరెడ్డి లావణ్య, గందె శ్రీనివాస్, ప్రతాప మంజుల, సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండాల్ రెడ్డి, ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు వన్నాల శివాజీ, మాజీ ప్రజా ప్రతినిధులు గందె రాధిక, మారేపల్లి సుశీల, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ముత్యంరాజు, ప్రతాప తిరుమల్ రెడ్డి, ఎండి గఫార్, ముక్క రమేష్, యాదగిరి నాయక్, ఎండి ఇమ్రాన్, ఎస్కే ఫయాజ్, మక్కపల్లి కుమారస్వామి, తలకొక్కుల ప్రసాద్, సర్పంచ్ పోల్సాని రామారావు, టి వెంకటేష్ గౌడ్, కాసాగోని కిరణ్, కొలిపాక సమ్మయ్య, తులసి లక్ష్మణమూర్తి, రేణుక తదితరులు పాల్గొన్నారు.





