
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని చేనేత సహకార సంఘం ఆవరణలో హుజురాబాద్ పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో ఘనంగా టైగర్ ఆలే నరేంద్ర 80వ జయంతి వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలి సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగెం సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర మాజీ మంత్రి టైగర్ ఆలే నరేంద్ర తన జీవితమంతా పేద ప్రజలకు అండగా నిలబడి బడుగు బలహీన వర్గాల పక్షాన పని చేశారని, తెలంగాణ సాధన సమితి నెలకొల్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారాని కొనియాడారు. కాషాయం నేతగా హిందువుల పక్షాన నిలబడి పాతబస్తీలో ముస్లింల అరాచకాల నుండి రక్షించిన మహానేత అన్నారు.
ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం అధ్యక్షులు ఎలిగేటి ఉపేందర్, రాష్ట్ర పద్మశాలి సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగెం సత్యనారాయణ, రాష్ట్ర పద్మ శాలి సంఘం కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్, వేముల యాదగిరి, సబ్బని రాజేందర్,మంచికట్ల కమలాకర్, చేనేత జిల్లా సెల్ అధ్యక్షులు బండారి సదానందం, చేనేత సెల్ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రామచంద్రము, మంద బిక్షపతి, ముషం వెంకటేశ్వర్లు, పాత్రికేయులు తాటిపాముల దేవేందర్, పోతరాజు సంపత్, సంగెం శ్రీనివాస్ (చిక్స్), సంగెం శ్రీనివాస్ (మెడికల్), కుడికాల ప్రభాకర్, అధిక సంఖ్యలో పద్మశాలి కుల బాంధవులు, నేత కార్మికులు మహిళా కార్మికులు పాల్గొన్నారు.





