
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ఉద్యోగులు, డీలర్లు సమన్వయంతో రైతుల ప్రయోజనాల కోసం కృషి చేయాలని అదనపు జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ చత్రు నాయక్ అన్నారు. బుధవారం హుజూరాబాద్ లో ఆయన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొని రైతులకు పాలు సూచనలు సలహాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన హుజురాబాద్ డివిజన్లోని వ్యవసాయ శాఖ అధికారులతో ఫర్టిలైజర్లు ఇతర వ్యవసాయ అనుబంధ వారితో సమావేశం ఏర్పాటు చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు లభించే విధంగా చూసుకోవాలన్నారు. ప్రతీ మంగళవారం రోజున జరిగే రైతునేస్తం కార్యక్రమానికి రైతులు హాజరయ్యి వ్యవసాయ శాఖ, శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటించాలని అన్నారు.


డి.ఏ.ఓ.గా భాగ్యలక్ష్మి పదవీ విరమణ చేపట్టగా తదుపరి జిల్లా వ్యవసాయ అధికారిగా వ్యవసాయ అధికారి గా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా హుజురాబాద్ డివిజన్ స్థాయిలో అధికారులు, డీలర్లు, రైతులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు గూండా సునిత , హుజురాబాద్ మండలం వ్యవసాయ అధికారి చందా భూమిరెడ్డి, ఖాదర్ హుస్సేన్ లు, ఏఈవోలు నిఖిల్, సతీష్ అనూష ,డీలర్లు,రైతులు పాల్గొన్నారు.





