
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 16 అంగన్వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మంగళవారం నుండి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభమైందని సిడిపిఓ సుగుణ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతితో పాటు వెరిఫికేషన్ సభ్యుల బృందం పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టిందని పేర్కొన్నారు. మంగళవారం సైదాపూర్ మండలంలోని గొడిశాల-1, గొడిశాల-2, సైదాపూర్-1, సైదాపూర్-2, శాలపల్లి అంగన్వాడీ కేంద్రాల టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహించామని తెలిపారు.
హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని కుమ్మరి వాడ, సైదాపూర్ మండలం దుద్దెనపల్లి-1, సర్వాయిపేట అంగన్వాడి అభ్యర్థులకు 2 బుధవారం సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు.





