
,మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి
వైఎస్సార్ రాజశేఖరరెడ్డి 17వ వర్థంతి వేడుకలు బుధవారం హుజరాబాద్ మున్సిపాలిటీలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బోర్నపల్లి లో వైయస్ విగ్రహానికి, కాంగ్రెస్ కార్యాలయంలో వైయస్ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. వైయస్ రాష్ట్రానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రొoటాల సుహాసిని, పట్టణ అధ్యక్షుడు తిరుపతి, మండల అధ్యక్షుడు కిరణ్, బండారి సదానందం, సంద మల్ల నరేష్, కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.





