
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో జనసేన పార్టీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం రంగనాయకుల గుట్ట వద్ద గల శ్రీ పాటిమిదీ ఆంజనేయస్వామి ఆలయంలో జననేన నాయకులు పవన్ కళ్యాణ్ పేరుమీద పూజ చేసి అనంతరం మెగా రక్తదాన శిబిభిరం శ్రీ మాత నర్సింగ్ హోమ్ లో ఏర్పాటు చేశారు. కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంబురాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్ లు, పండ్లను, పంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ జనసేన నాయకులు అన్వేష్ బర్ల , సాగర్ ఎజ్జిగిరి, శ్రీకాంత్ నల్లా, సిహెచ్ అంజి, ఏం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.





