
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన అభూతకల్పన హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలను తీవ్రంగా వంచించిందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు పూసల ప్రభావతిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని హామీలను నిలదీస్తూ “420 హామీలు – 420 ఫిట్లు” పేరుతో రూపొందించిన నిరసన ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ తీరును ఎండగట్టాయి. ఈ సందర్భంగా ప్రజలకు “కాంగ్రెస్ బాకీ కార్డు”లను పంపిణీ చేశారు. ప్రతి ఇంటికీ చేరుకుని కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిన గ్యారెంటీలు, నెరవేర్చని వాగ్దానాల వివరాలను ప్రజలకు స్పష్టంగా వివరించారు.

పూసల ప్రభావతి రెడ్డి మాట్లాడుతూ:
”ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వందలాది హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలను పూర్తిగా విస్మరించింది. ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున మా పోరాటం నిరంతరం కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు.

ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని హామీలను నిలదీస్తూ “420 హామీలు – 420 ఫిట్లు” పేరుతో రూపొందించిన నిరసన ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ నిరసన తెలుపుతున్న ప్రభావతి రెడ్డి.

ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.





