
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణ శివారులోని కేసి క్యాంపులో గల నాక్ శిక్షణ కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసి ఫ్యాన్లు, విలువైన సర్వే పరికరాలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… ఈనెల మూడవ తేదీ సెంటర్ను మూసివేసి తిరిగి 5వ తేదీన అందులో పని చేసే స్వీపర్ లక్ష్మి రాగా స్టోర్ రూమ్ గది తాళం తీసి ఉన్నది గమనించి లోపలికి వెళ్లి చూడగా ఐదు ఫ్యాన్లు లక్షన్నర విలువగల సర్వే పరికరాలు చోరీకి గురైనట్లు గుర్తించింది, ఈ విషయాన్ని సెంటర్ నిర్వాహకులకు పోలీసులకు ఆమె తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హుజురాబాద్ టౌన్ సిఐ కరుణాకర్ తెలిపారు.
@@ లోకల్ యాడ్స్ @@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు : శ్రీమతి శ్రీ సొల్లు సునీత – సొల్లు బాబు 5వ వార్డు కౌన్సిలర్ పురపాలక సంఘం హుజురాబాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హుజురాబాద్.





