Oplus_16908288
—అసెంబ్లీ ఘటనపై తీవ్ర ఆగ్రహం
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: శాసనసభ వేదికగా ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత దురదృష్టకరమని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని బీఆర్ఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడవల్లి కొండారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను, ముఖ్యంగా 420 హామీల అమలు తీరును నిలదీస్తారనే భయంతోనే ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్ట్ చేయించిందని మండిపడ్డారు. ఈ చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు.
ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కాలరాసే విధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తోందని ఆయన విమర్శించారు. సభలో మహిళలను సైతం కించపరిచే విధంగా పాలకులు వ్యవహరించడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై గళమెత్తిన ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురిచేయడం నియంతృత్వ వైఖరిని చాటుతోందన్నారు.
ప్రభుత్వం తక్షణమే తన తప్పును తెలుసుకుని, అక్రమంగా అరెస్టు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎటువంటి షరతులు లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మహిళలను అవమానించేలా మాట్లాడిన తీరుపై ప్రభుత్వం వెంటనే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
@@ లోకల్ యాడ్స్ @@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు : శ్రీమతి శ్రీ సొల్లు సునీత – సొల్లు బాబు 5వ వార్డు కౌన్సిలర్ పురపాలక సంఘం హుజురాబాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హుజురాబాద్.





