
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: శాసనసభాపతి స్థానంలో ఉన్న దళిత వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ రావుపై బీఆర్ఎస్ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సొల్లు బాబు తీవ్రంగా ఖండించారు. సభాధ్యక్షుడిని ‘వాడు, వీడు’ అంటూ అనుచిత పదజాలంతో మాట్లాడటం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సంస్కారహీనతకు నిదర్శనమని మండిపడ్డారు.
అసెంబ్లీ నియమావళి ప్రకారం స్పీకర్ పదవికి అత్యున్నత గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకర్ను గౌరవించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడమేనని, సభాపతిని అవమానించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా దళిత సమాజాన్ని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు.
దళిత స్పీకర్ పట్ల అహంకారపూరితంగా వ్యవహరించిన బీఆర్ఎస్ అగ్రవర్ణ శాసనసభ్యులు వెంటనే దళిత సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ నాయకత్వంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని నియోజకవర్గంలో ఎక్కడికక్కడ అడ్డుకుంటామని, ఆయనను తిరగనివ్వబోమని సొల్లు బాబు హెచ్చరించారు.
## లోకల్ యాడ్స్ ##
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు : శ్రీమతి శ్రీ సొల్లు సునీత – సొల్లు బాబు 5వ వార్డు కౌన్సిలర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హుజురాబాద్.





