
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు ప్రవర్తించిన తీరును ఆక్షేపిస్తూ మంగళవారం హుజురాబాద్ పట్టణంలో బి.ఆర్.ఎస్. నాయకుల ఆధ్వర్యంలో మహిళలు కన్నెర్ర చేశారు. బి ఆర్ ఎస్ మహిళా నాయకురాల్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు ప్రవర్తించిన తీరును నిరసించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మహిళలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవం లేకపోవడం వల్లనే అసెంబ్లీ ముందు పోలీసులు అనుచిత ప్రవర్తన చేశారని అన్నారు. తమపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని కంటతడి పెడుతున్న మహిళా ఎమ్మెల్యేల విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్కసారి కూడా కనీసం క్షమాపణ చెప్పలేదని విచారణ జరుపుతున్నట్లు కూడా చెప్పడం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళల ఓట్లు కావాలి తప్ప మహిళల బాగోగులు మహిళల గౌరవం అవసరం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మహిళల అగౌరపరచరాదని, ఆ మహిళ ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.


ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మహిళ విభాగం నాయకులు మాజీ చైర్పర్సన్ గందె రాధిక, కౌన్సిలర్లు కేసిరెడ్డి లావణ్య, బండ సింధుజ, ప్రతాప మంజుల, ప్రతాప తార, మాజీ కౌన్సిలర్ మారేపల్లి సుశీల, కల్లేపల్లి రమాదేవి, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మంద ఉమాదేవి, పూసల ప్రభావతి రెడ్డి, కోయడ శ్రీదేవి, నాయకులు బండ శ్రీనివాస్, ప్రతాప తిరుమల్ రెడ్డి ముత్యం రాజు , చందా గాంధీ, ఎండి ఇమ్రాన్, కోయ డ కమలాకర్ గౌడ్, పంజాల శ్రీధర్, ప్రతాపకృష్ణ, టి హరి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.





