Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ఈనెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు హుజురాబాద్ మండల స్థాయి ఎస్జీఎఫ్ క్రీడలు ప్రారంభం అవుతున్నట్లు ఎస్జిఎఫ్ మండల కార్యదర్శి పిడి చిరుత శ్రీనివాస్ అన్నారు. ఈ క్రీడల్లో కబడ్డీ కోకో వాలీబాల్ అంశాలలో బాలబాలికలకు క్రీడలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. క్రీడా పోటీలు బుధవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానాన్ని క్రీడల కోసం మైదానాలను వ్యాయామ ఉపాధ్యాయుల బృందం సహకారంతో సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివే హక్కులైన బాలబాలికలు ఈ పోటీలకు ఆహ్వానం అని తెలిపారు.





