
—22A భూముల అక్రమాలపై ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, సెప్టెంబర్ 10: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 25 సంవత్సరాల ప్రజాసేవ, అంకితభావం మరియు దేశసేవను పురస్కరించుకొని, బీజేపీ హుజురాబాద్ పట్టణ శాఖ అధ్యక్షులు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో గురువారం విశేష ఫంక్షన్ హాల్లో “సేవా సంకల్ప్ అభియాన్” కార్యశాల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సేవా స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, పేదలు, రైతులు, మహిళలు, యువత మరియు సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.


సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు హుజురాబాద్ పట్టణంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రక్తదాన శిబిరాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, అంగన్ బడి కేంద్రాల సందర్శన, మొక్కల పెంపకం, పేదలకు సహాయ కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు తదితర ప్రజా సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ “సేవే సాధనం – దేశమే ప్రధానం” అనే స్ఫూర్తితో ప్రజలకు అండగా నిలుస్తూ, సమాజ సేవలో ప్రతి బీజేపీ కార్యకర్త భాగస్వామి కావాలని కోరారు. సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
బిజెపి పట్టణ, మండల శాఖ అధ్యక్షులు తూర్పాటి రాజు, పారుపల్లి కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం

22A భూముల అక్రమాలపై వినతిపత్రం
సమావేశం అనంతరం హుజురాబాద్ MRO కార్యాలయంలో ఆర్ఐ గారికి వినతిపత్రం సమర్పించారు. 22Aలో జరుగుతున్న అక్రమాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ నిర్వహించాలని, భూ భారతి పరిధిలోని భూ ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, అక్రమాల కారణంగా రైతులు, పేదలు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.
రైతులు, పేదలు తమ భూముల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని బీజేపీ నాయకులు కోరారు. భూ సమస్యల పరిష్కారం కోసం బాధితులకు అండగా నిలిచి, అవసరమైతే ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, బిజెపి సీనియర్ కేసరి శసయ్య, పట్టణ, మండల అధ్యక్షులు తూర్పాటి రాజు, పారిపెల్లి కొండల్ రెడ్డి, జిల్లా నాయకులు రావుల వేణు, గంగిషెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి గంట సంపత్, తిప్పబతిని రాజు, కౌన్సిలర్ పడారి సుమలత, సీనియర్ నాయకులు నరాల రాజశేఖర్, పట్టణ ఉపాధ్యక్షులు యాళ్ళ సంజీవరెడ్డి, ఇల్లందుల ప్రణీత్, ఎస్సి మోర్చా అధ్యక్షులు ఎర్ర శ్రీధర్, ఎస్టీ మోర్చా అధ్యక్షులు కుతాడి కుమారస్వామి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు కొలిపాక వెంకటేష్, కిసాన్ మోర్చా అధ్యక్షులు మాసాడి శ్రీనివాసరావు, యాంసని శశిధర్, పట్టణ కార్యదర్శి బొడిగ రాధ, కొడిమెల పవన్ కుమార్, కొలుగూరి అనిల్, కోశాధికారి క్యాస వెంకటేష్, పడారి కొమురయ్య, మొలుగురి నగేష్, కోలుగూరి శిరీష, మాసాడి రవీందర్రావు, కుర్ర సంపత్, డోరి ఐలయ్య, దాసరి వీరన్న, పిట్టల విజయ్, తూర్పాటి శంకర్, రాం చంద్రం, సురేష్, చిరంజీవి, గరిగే శివకృష్ణ, అశోక్ పిట్ట నర్సింగం మరియు జిల్లా పదాధికారులు, పట్టణ పదాధికారులు, పట్టణ కార్యవర్గ సభ్యులు, వివిధ మోర్చాల నాయకులు, శక్తి కేంద్ర ఇన్చార్జులు, ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, బూత్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, బీఎల్ఏ-2లు మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.





