Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పోలేపాక విల్సన్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ చేతుల మీదుగా విల్సన్ నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా రాంపూర్, రంగాపూర్ గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులకు విల్సన్ కృతజ్ఞతలు తెలియజేశారు.






