Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజూరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలో గణేశుని నిమజ్జనానికి కనీసం చుక్క నీరు లేని పరిస్థితి దాపురించిందని, వెంటనే సంబంధిత అధికారులు, జిల్లా ఇన్చార్జి మంత్రి స్పందించి ఎస్సారెస్పీ (SRSP) కెనాల్ లోకి నీటిని విడుదల చేయాలని BRS సీనియర్ నాయకుడు, సామాజిక కార్యకర్త, 12వ వార్డు కౌన్సిలర్ వర్థినేని రవీందర్ రావు డిమాండ్ చేశారు.
నవరాత్రుల పాటు ఎంతో భక్తిశ్రద్ధలతో, వైభవంగా పూజలందుకున్న గణనాథులను నిమజ్జనం చేయడానికి నీళ్లు లేక భక్తులు ఇక్కట్లు ఎదుర్కొంటుండటం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పరిస్థితి తీవ్రతను గమనించి, తక్షణమే ఎస్సారెస్పీ కాల్వ ద్వారా నీటిని విడుదల చేసి నిమజ్జనానికి ఇబ్బందులు లేకుండా చూడాలని రవీందర్ రావు విజ్ఞప్తి చేశారు.
## లోకల్ యాడ్స్ ##
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ గిన్నారపు మహేందర్ గారు, ఉపసర్పంచ్ జూపాక, బి.ఎస్.పి అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు హుజురాబాద్.





